Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం వద్ద పెరిగిన వరద ఉద్ధృతి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 30, 2026 12:28 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాళేశ్వరం వద్ద పెరిగిన వరద ఉద్ధృతి - Udayam
గోదావరి, ప్రాణహిత నదులు కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పుష్కర ఘాట్ల వద్ద నీటిమట్టం పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీకి 1,01,530 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...