వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విడుదలయ్యే ప్రతి కొత్త తమిళ సినిమా మొదటి వారం పాటు రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ మేరకు నిర్ణయాన్ని ఆమోదించారు.
ఇప్పటివరకు అదనపు షోల ప్రదర్శన కోసం చిత్ర బృందాలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా, థియేటర్ల యజమానులు, నిర్మాతల నిర్ణయం మేరకే ఐదో షోను ప్రదర్శించుకోవచ్చని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

