వార్తలకు తిరిగి వెళ్లండి

దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి తొలి పాట ‘చిట్టి చిట్టి చీమ’ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతున్నారు.
జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం రాశారు. శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు సహా నాలుగు భాషల్లో త్వరలో విడుదల కానుంది.
Comments
Loading comments...
