వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి ఫార్మా సిటీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించిన సీఎం, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

