Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబితమ్మ ఎదుట రైతుల కన్నీరు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 19, 2026 1:16 PM రంగారెడ్డి General
సబితమ్మ ఎదుట రైతుల కన్నీరు - Udayam
శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూములు కోల్పోతున్న బాధిత రైతులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు మహిళా రైతులు ఆమె వద్ద బోరున విలపించారు. ప్రభుత్వం అక్రమంగా తమ భూములను లాక్కుంటోందని, ఎలాగైనా తమను ఆదుకుని భూములను కాపాడాలని వారు కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ తీరుపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు వారికి భరోసా కల్పించారు.

Comments

G
Loading comments...