వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో గురువారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1079.70 అడుగులు, నీటి నిల్వ 44.266 టీఎంసీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1087.10 అడుగుల వద్ద 66.783 టీఎంసీల నీరు ఉంది.
గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి సగటున 1,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అదే స్థాయిలో 1,013 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 33.975 టీఎంసీల నీరు చేరగా, 6.052 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
Comments
Loading comments...

