వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి నయారా పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయలు అమ్మేందుకు ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న ఫాతిమాపురానికి చెందిన గొల్లపల్లి ఇశ్రాయేలును వెనుక నుంచి కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ద్వారకాతిరుమలకు చెందిన చందు కారును నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇశ్రాయేలుకు గాయాలయ్యాయి.
Comments
Loading comments...

