Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీపీ పాఠశాలలను సందర్శించిన వేపాడ ఎంఈవో

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:33 PM విజయనగరంGeneral
ఎంపీపీ పాఠశాలలను సందర్శించిన వేపాడ ఎంఈవో - Udayam
వేపాడ మండలం సింగరాయి, ఆకుల సీతంపేట ఎంపీపీ పాఠశాలలను ఎంఈవో బాల భాస్కరరావు శుక్రవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణను పరిశీలించి, విద్యార్థుల చదవడం, రాయడం సామర్థ్యాలను పరీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ఆన్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూను సక్రమంగా అమలు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...