Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెన్షనా?

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 3:37 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెన్షనా? - Udayam
కాంగ్రెస్‌ పార్టీ కోసం 20 ఏళ్లుగా పనిచేసిన తమను సస్పెండ్‌ చేయడం అన్యాయమని మల్హర్‌ మండలం కొయ్యూర్‌ ఉపసర్పంచ్‌ లకావత్‌ సవేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైనందుకే తమపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. తనతో పాటు వార్డు సభ్యులు లకావత్‌ లక్ష్మి, తిరుపతి, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు ఖలీంపై సస్పెన్షన్‌ వేటు వేశారని తెలిపారు.

Comments

G
Loading comments...