Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లమ్మ దేవతను దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 08, 2026 5:42 PM నాగర్ కర్నూల్General
ఎల్లమ్మ దేవతను దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి - Udayam
అమ్రాబాద్ మండలం తిర్మాలపూర్ లో ఉన్న రేణుక ఎల్లమ్మ దేవతను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సతీమణి చిక్కుడు అనురాధ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఆమె మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలను కాపాడాలని దేవతను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...