వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంత సమీపంలో రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగులు సమీపంలోని గ్రామాల పంట పొలాల్లోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
మైలావాండ్లపల్లి, మల్లెలవాండ్లపల్లి ఎస్సీ కాలనీ, దేవరకొండ, తుమ్మసేనుపల్లి, కొత్తపల్లి, గొల్లపల్లి, నగిరిసిరిగలవారిపల్లె గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

