Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ప్రమాద మృతుల పరిహారం రూ.8 లక్షలకు పెంపు

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 30, 2026 8:07 AM హైదరాబాద్తెలంగాణ
విద్యుత్ ప్రమాద మృతుల పరిహారం రూ.8 లక్షలకు పెంపు - Udayam Digital
విద్యుత్ శాఖతో సంబంధం లేని వ్యక్తులు విద్యుత్ ప్రమాదాల్లో మృతిచెందితే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతూ టీజీఎస్‌పీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. పరిహారంలో రూ.7.20 లక్షలను వారసుల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, రూ.80 వేల నగదు అందజేస్తారు. పశువులు మృతిచెందిన సందర్భాల్లోనూ నిర్ణీత పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...