Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో టీపీటీఎఫ్‌ క్రీడా పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
madhu Aug 30, 2026 6:01 PM ములుగుక్రీడలు
ఏటూరునాగారంలో టీపీటీఎఫ్‌ క్రీడా పోటీలు ప్రారంభం - Udayam
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరునాగారంలో టీపీటీఎఫ్‌ ములుగు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్పంచ్‌ కాకులమర్రి శ్రీలత పోటీలను ప్రారంభించారు. క్రీడలు ఉపాధ్యాయుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...