Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 16, 2026 12:56 PM అల్లూరి General
చింతపల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టు - Udayam
మన్యానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు చింతపల్లి అటవీ డివిజన్‌లో ఎకో టూరిజం ప్రాజెక్టులను అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. కృష్ణాపురం పైన్ తోటల్లో పర్యావరణానికి హాని లేకుండా సహజసిద్ధ వనరులతో వసతులను కల్పించారు. ఇక్కడ పర్యాటకుల బస కోసం టెంటెడ్ కాటేజీలు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అడ్వంచర్ పార్క్ మరియు కెఫెటేరియాను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిధులతో ఈ ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...