Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల్లో చోరీలు: ముగ్గురు అరెస్టు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 16, 2026 2:23 PM అనంతపురంGeneral
ఆలయాల్లో చోరీలు: ముగ్గురు అరెస్టు - Udayam
చదువు మానేసి వ్యసనాలకు బానిసలై ఆలయాల్లో హుండీలను దొంగిలిస్తున్న ముగ్గురు యువకులను ఉరవకొండ పోలీసులు అరెస్టు చేశారు. పెన్నహోబిలం లక్ష్మి, కొనకొండ్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో వీరు చోరీలకు పాల్పడినట్లు సీఐ మహానంది తెలిపారు. నిందితుల నుంచి రూ.20,600 నగదు, ఒక ఆటో, హుండీ, నాలుగు సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు నిందితులకు రిమాండ్ విధించడంతో వారిని కారాగారానికి తరలించారు.

Comments

G
Loading comments...