వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో ఈగల్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఒడిశా నుంచి ఏలూరు మీదుగా వచ్చే రైలులో అనుమానిత వ్యక్తులు, బ్యాగులు, లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా, తనిఖీలు కొనసాగుతాయని ఈగల్ ఆర్‌ఎస్‌ఐ బి. ఉదయభాస్కర్ తెలిపారు. సమాచారం ఉంటే 1972, 112కు తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...

