Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పుగూడలో డ్రైనేజ్‌ మరమ్మతులు.. రాకపోకలకు అంతరాయం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 7:43 AM హైదరాబాద్General
ఉప్పుగూడలో డ్రైనేజ్‌ మరమ్మతులు.. రాకపోకలకు అంతరాయం - Udayam
ఉప్పుగూడ పరిధిలోని తానాజీ నగర్‌లో గురువారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డ్రైనేజ్, పైపులైన్ మరమ్మతు పనులు చేపట్టారు. వైన్స్ షాపు పక్క వీధిలో జేసీబీతో రోడ్డు తవ్వి కొత్త పైపులు వేస్తున్నారు. దీంతో ఆ వీధిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానికంగా డ్రైనేజ్ పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.

Comments

G
Loading comments...