వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నేతల మాయమాటలను ప్రజలు నమ్మవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, ఆరోగ్య బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. జూన్ 30న మధిరలో జరగనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

