Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి ఆఫర్ పేరుతో సైబర్ మోసాలు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:27 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
దీపావళి ఆఫర్ పేరుతో సైబర్ మోసాలు - Udayam
దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ రూ.8 వేలు కానుకగా ఇస్తున్నారంటూ వాట్సాప్‌లో వస్తున్న సందేశాలు నకిలీవని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌లు, లింకులు పంపుతున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత, బ్యాంకు వివరాలు నమోదు చేయకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...