Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి పద్మశాలి సంఘంలో ఘనంగా రాఖీ పండుగ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 28, 2026 11:28 AM నిజామాబాద్General
ధర్పల్లి పద్మశాలి సంఘంలో ఘనంగా రాఖీ పండుగ - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ భవనంలో ప్రత్యేక యజ్ఞం నిర్వహించి, కుల సభ్యులు సంప్రదాయబద్ధంగా జంజరం (జంధ్యం) ధరించారు. అనంతరం పరస్పరం రాఖీలు కట్టుకుని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలతో పద్మశాలి సంఘ భవనం సందడిగా మారింది.

Comments

G
Loading comments...