Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా నంబర్‌వన్‌గా ధీరజ్

ప్రణీత రెడ్డి Jul 15, 2026 8:31 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
ఆసియా నంబర్‌వన్‌గా ధీరజ్ - Udayam Digital
భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర తాజా ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో ఆసియా నంబర్‌వన్‌గా నిలిచాడు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో అగ్రస్థానం సాధించిన ఈ విజయవాడ కుర్రాడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి చేరాడు. ప్రపంచ టాప్‌-10లో స్థానం దక్కించుకున్న ఏకైక భారత ఆర్చర్‌గా ధీరజ్ నిలిచాడు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ నాలుగో స్థానానికి చేరింది.

Comments

G
Loading comments...