Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 7:19 AM తిరుపతిGeneral
శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ - Udayam
వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు లేనివారి క్యూలైన్లు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు దాటి శ్రీవారి సేవాసదన్‌ వరకు చేరాయి. దర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది. శుక్రవారం 73,699 మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.4.03 కోట్ల హుండీ కానుకలు లభించాయి. భక్తులు యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కోరారు.

Comments

G
Loading comments...