Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీ ఆశ్రమంలో శ్రావణ పూర్ణిమ వేడుకలు

Follow Udayam on Google
RAGHU SKLM Aug 28, 2026 5:55 PM శ్రీకాకుళంGeneral
దేవీ ఆశ్రమంలో శ్రావణ పూర్ణిమ వేడుకలు - Udayam
ఎచ్చెర్ల మండలం కుంచాలకురుమయ్యపేట దేవీ ఆశ్రమంలో శుక్రవారం శ్రావణ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బాల భాస్కర్ శర్మ నేతృత్వంలో సుమారు 2 వేల మంది మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమార్చన పూజలు చేశారు. మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, అక్షింతలు, అమ్మవారి ఫోటోలు పంపిణీ చేశారు. అన్నప్రసాద వితరణ చేపట్టారు. లలితామణి, ప్రసాదరావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...