Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో చెరువులో మునిగి ఇద్దరు వేద విద్యార్థుల మృతి

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 30, 2026 11:43 AM పల్నాడు ఆంధ్రప్రదేశ్
అమరావతిలో చెరువులో మునిగి ఇద్దరు వేద విద్యార్థుల మృతి - Udayam Digital
అమరావతి మండలం యండ్రాయి వేద పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు చెరువులో మునిగి మృతిచెందారు. గోశాలకు చెందిన ఆవును బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురుపౌర్ణమి రోజే ఈ విషాదం చోటుచేసుకోవడంతో పాఠశాలలో, మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...