వార్తలకు తిరిగి వెళ్లండి
యూఎస్‌లో తెలుగు యువకుడి మృతి

అమెరికాలో స్కైడైవింగ్ చేస్తూ ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గడ్డం మణిచంద్రతేజ మృతి చెందాడు. ఈ నెల 12న మసాచుసెట్స్‌లో పారాచూట్‌తో కిందకు దిగుతుండగా గాలి ఉద్ధృతికి 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు.
తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లిన ఈ విజయవాడ యువకుడు, ప్రస్తుతం బోస్టన్‌లో స్థిరపడ్డాడు.
Comments
Loading comments...