వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం డబారు గ్రామంలో మంగళవారం చోరీ జరిగింది. తెలగవలస వేణుగోపాల్, సునీత దంపతులు కుమారుడి అనారోగ్యంతో ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లారు. గంటలోపే తిరిగి వచ్చేసరికి బీరువాలోని సుమారు రెండున్నర తులాల బంగారం కనిపించలేదు.
రూ.26 వేల నగదు మాత్రం అలాగే ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై కె. కృష్ణప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

