Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 18, 2026 11:05 AM రంగారెడ్డిGeneral
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు తమ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులు భయపడుతున్నారని, వారు బూతులు తిడతారనే భయంతో వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గానికి మంజూరైన ఇళ్లను వేరే వారికి కేటాయించారని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రికి చెబితే ‘కూల్.. కూల్’ అంటున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...