Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలస్యమైతే పరిహారం చెల్లించాల్సిందే

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 27, 2026 3:43 PM జాతీయంGeneral
ఆలస్యమైతే పరిహారం చెల్లించాల్సిందే - Udayam
ఫ్లాట్ నిర్మాణంలో జాప్యం జరిగితే, ఇల్లు అప్పగించిన తర్వాత కూడా బిల్డర్ నుండి నష్టపరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వాధీనం చేసుకున్నంత మాత్రాన పరిహారం పొందే హక్కు రద్దు కాదని కోర్టు తేల్చిచెప్పింది. వినియోగదారుల రక్షణ చట్టం ఆర్బిట్రేషన్ నిబంధనల కంటే అధికమని, బాధితులకు ఇది అదనపు రక్షణ కల్పిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఈ వివాదాలను ఏడాదిలోగా పరిష్కరించాలని కింది కోర్టులను ఆదేశించింది.

Comments

G
Loading comments...