Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిపివేత

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:52 PM పెద్దపల్లి General
వర్షంతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిపివేత - Udayam
శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి సింగరేణి ఆర్జీ-3 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. ఓసీపీ-1, 2 పని స్థలాలు బురదమయంగా మారడంతో డంపర్లు, షావెల్స్‌, డోజర్లు నిలిచిపోయాయి. వరదనీరు కోల్‌ బెంచీల్లోకి చేరడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఓసీపీ-1, 2ల్లో సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...