Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తడి నేలల సంరక్షణకు చర్యలు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:59 PM జోగులాంబ గద్వాల్ General
చిత్తడి నేలల సంరక్షణకు చర్యలు - Udayam
జిల్లాలోని 101 చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు. మంగళవారం గద్వాల కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జలవనరుల సరిహద్దులను కొలిచి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. గ్రామసభల్లో అభ్యంతరాలు స్వీకరించి సర్వేను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...