వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం పట్టణంలోని వివిధ కాలనీలలో ఉన్న చిన్న కల్వర్టులతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీ, రామ్ నగర్, కవ్వాల్ చౌరస్తా, వినాయక్ నగర్, తదితర కాలనీలలో వరదనీరు పోయేందుకు కల్వర్టులు నిర్మించారు.
అయితే భారీ వర్షాలకు వరద నీరు ఎక్కువగా వస్తోంది. దీంతో చిన్న కల్వర్టుల నుండి వరద నీరు సరిగ్గా పోక రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
Comments
Loading comments...

