వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి మండలంలో బుధవారం ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన చిరుజల్లుల వర్షం ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది.
ఈ వర్షం వరి నారుమళ్లకు, అంతర పంటలకు ఎంతో ప్రయోజనకరమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

