వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. రజక సంఘ అధ్యక్షుడు జూపల్లి జంగయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె పోరాడారని సర్పంచ్ నాగరాజు అన్నారు.
తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిన వీరురాలు ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

