Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీకటిలోనే పండుగ జరుపుకున్న నెలటూరు గ్రామ ప్రజలు

Follow Udayam on Google
I siva prasad Sep 19, 2026 6:34 PM నెల్లూరుGeneral
వినాయక చవితి పర్వదిన వేడుకలను గూడూరు పురపాలక సంఘం నెల్లటూరు గ్రామ ప్రజలు చీకటిలోనే జరుపుకున్నారు. గత 20 రోజులుగా ప్రధాన వీధుల్లో వీధిలైట్లు వెలగడం లేదని మున్సిపల్ కమిషనర్ కు సిబ్బందికి తెలియజేసిన కేవలం రెండు పాత లైట్లు వేసి మమ అనిపించుకున్నారు. ప్రధాన వీధులన్నీ లైట్ లేక చీకటిలోనే ఉన్నాయి. దీంతో వినాయక చవితి పర్వదిన వేడుకలను చీకటిలో జరుపు కోవాల్సి వచ్చిందని భక్తులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...