Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 30, 2026 8:35 AM అమరావతిGeneral
విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - Udayam
నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. సదస్సును వినూత్నంగా నిర్వహించాలని, నాలెడ్జ్ షేరింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ, జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించనున్నారు. పెట్టుబడులే కాకుండా స్టార్టప్‌లు, యువత భాగస్వామ్యానికి, వ్యవసాయం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో వినూత్న ఆలోచనలకు ఈ వేదికలు బాటలు వేయాలని సీఎం సూచించారు.

Comments

G
Loading comments...