వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు సినిమా పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు ఒక నిధి అని, ఆయన ఇండస్ట్రీకి భీష్మాచార్యుడని చిరంజీవి కొనియాడారు. 94 ఏళ్ల వయసులో ఆయన రూపొందించిన ‘సింగ్ గీతం’ జూన్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.
అనుభవజ్ఞుడైన సింగీతంతో కలిసి, ఈ చిత్రాన్ని నిర్మించిన నాగ్ అశ్విన్ ఆలోచన ఎంతో స్ఫూర్తిదాయకమని చిరంజీవి ప్రశంసించారు. గ్రామస్థుల మాటలు పాటలుగా మారే వింత కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

