వార్తలకు తిరిగి వెళ్లండి
‘విసా’ నుంచి ఆకట్టుకుంటున్న ‘చింగారి’

అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘విసా (వింటారా సరదాగా)’ చిత్రం నుంచి రెండో గీతం ‘చింగారి’ విడుదలైంది. ఈ మెలోడీ సాంగ్‌కు విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, సిద్ శ్రీరామ్, లిప్సిక ఎంతో అందంగా ఆలపించారు.
అమెరికా నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ పాటలో అశోక్, గౌరీ ప్రియల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువతను అలరించేలా ఉన్న ఈ చిత్రానికి ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Loading comments...