వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ ఉన్నతి హుడా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో కిమ్ గయిన్ చేతిలో 10-21, 18-21తో ఓడిపోయింది. రెండో గేమ్‌లో 18-18తో సమంగా నిలిచినా.. వరుస తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయింది.
పురుషుల డబుల్స్‌లో అర్జున్-హరిహరన్ జంట గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. బుధవారం లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలోకి దిగనున్నారు.
Comments
Loading comments...

