Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్ పవర్ రద్దు ఆలోచన విరమించాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:14 PM జోగులాంబ గద్వాల్ General
 చెక్ పవర్ రద్దు ఆలోచన విరమించాలి - Udayam
ఉప సర్పంచులకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం మార్చుకోవాలని ఉప సర్పంచుల ఫోరమ్‌ మండల ఉపాధ్యక్షుడు మార్క కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. చెక్ పవర్‌ రద్దు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గ్రామపంచాయతీల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన పనుల్లో ఉప సర్పంచులకు కీలక బాధ్యతలు ఉన్నాయని కమలాకర్‌ తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్‌పై పునరాలోచించాలని కోరారు.

Comments

G
Loading comments...