Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు ఆర్యపై కేసు నమోదు

Follow Udayam on Google
రచన దేవి Jul 12, 2026 12:34 PM జాతీయంవినోదం
 నటుడు ఆర్యపై కేసు నమోదు - Udayam
సినిమా షూటింగ్ కోసం ఖరీదైన కెమెరాలు అద్దెకు తీసుకుని, రూ.1.80 కోట్ల బకాయిలు చెల్లించకుండా మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ తమిళ నటుడు ఆర్య, నిర్మాత వినోద్‌ సహా చిత్రబృందంపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 'అనంతన్ కాడు' సినిమా చిత్రీకరణకు తాహేర్ సినీ టెక్నిక్ నుంచి వీరు పరికరాలు తీసుకున్నారు. బకాయిలు అడిగితే తమ మేనేజర్‌ను బెదిరించారని, వాస్తవాలు దాచిపెట్టి కేరళ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...