వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మండలం పోచారం తండా పరిధిలోని అమర్‌సింగండాలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదైంది. గ్రామానికి చెందిన బాదావత్ సురేష్ కిరాణ దుకాణానికి మద్యం కొనుగోలుకు వచ్చి, దుకాణ యజమాని కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దుకాణ యజమాని వాంకుడోత్ లింగ, కొమరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దాని మేరకు సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగులమీరా తెలిపారు.
Comments
Loading comments...

