Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ వర్ధంతికి ఘన నివాళి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 10, 2026 1:26 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రిమ్స్‌ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ రాజర్షి షా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనుష సతీష్‌తో కలిసి ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...