Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుడమాల చెరువులో ఇద్దరు చిన్నారుల మృతి బాధాకరం ఎమ్మెల్యే

Follow Udayam on Google
Dinesh Kumar Oct 01, 2026 4:00 PM చిత్తూరుGeneral
బుడమాల చెరువులో ఇద్దరు చిన్నారుల మృతి బాధాకరం ఎమ్మెల్యే - Udayam
చిత్తూరు మంగసముద్రంకు చెందిన బాలాజీ, హరి బుడమాల చెరువులో నీటిలో మునిగి మృతి చెందడంపై ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబాలకు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

Comments

G
Loading comments...