వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలోని మొరిగోవ్ జిల్లా మాయోంగ్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు అస్సాంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
ఈ ఆకస్మిక వరద ప్రవాహంతో నదీతీర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీటిమట్టం నిరంతరం పెరుగుతుండటంతో అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు, వరద ముప్పు పొంచి ఉన్నందున ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

