వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాం(పీ)లో మంగళవారం గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

