వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ సంప్రదాయ పండుగల్లో ప్రత్యేకమైన బోనాల పండుగను శనివారం ఓ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు బోనాలతో పాటు పోతరాజుల వేషధారణలో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
సంస్కృతి, సంప్రదాయాలకు, పాడి పంటలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవ ప్రాధాన్యతను పాఠశాల ప్రిన్సిపల్ తిష వివరించారు. కార్యక్రమంలో పలువురు చిన్నారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

