వార్తలకు తిరిగి వెళ్లండి

పెంచికలపాడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుర్వ గోవర్ధన్ (18) అనే యువకుడు మృతిచెందాడు. గొర్రెలను మేపుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన క్రమంలో, బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలను నింపింది.
Comments
Loading comments...

