వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్సీబీ విజయ రహస్యం చెప్పిన భువీ

ఐపీఎల్‌లో వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయ రహస్యాన్ని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు. పక్కా డేటా ఆధారంగా, సపోర్ట్ స్టాఫ్ అందించిన చిన్న చిన్న వ్యూహాలను మైదానంలో అమలు చేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని భువీ పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న భువీ.. కేవలం డేటాపైనే కాకుండా పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేశామని చెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి కావడం విశేషం.
Comments
Loading comments...