Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్ల తర్వాత భువి.. భారత టీ20 జట్టులోకి పునరాగమనం

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:41 AM జాతీయంక్రీడలు
నాలుగేళ్ల తర్వాత భువి.. భారత టీ20 జట్టులోకి పునరాగమనం - Udayam
న్యూజిలాండ్‌తో ఈ నెల 22 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టులో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చోటు దక్కించుకున్నాడు. 2022 నవంబర్‌ తర్వాత నాలుగేళ్లకు టీమ్‌ఇండియాలోకి తిరిగి వచ్చాడు. 2026 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీసిన భువి.. జట్టు టైటిల్‌ సాధించడంలో కీలకంగా నిలిచాడు. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.

Comments

G
Loading comments...