వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూర్‌లో నిర్వహించిన ప్రజావాణిలో బుజిలాపురం గ్రామానికి చెందిన రైతు మడూరి నారాయణరెడ్డి పురుగుమందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. వారసత్వంగా వచ్చిన 3.5 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని, ఎనిమిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో అధికారులు పురుగుమందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

